ప్రపంచపు అత్యంత ధనిక మహిళ మృతి

0
1348
ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ లిలియానే బెటెన్‌కోర్టు(94) కన్నుమూశారు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ లోరియల్‌కు ఆమె వారసురాలు. కంపెనీ వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్‌కు బెటెన్‌కోర్టు కూతురు. ఫోర్బ్స్‌, బ్లూమ్‌బర్గ్‌ బిలినీయర్‌ ఇండెక్స్‌లలో బెటెన్‌కోర్టు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా పేరు దక్కించుకున్నారు. ఆమె నికర సంపద సుమారు 44 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ.2,85,980 కోట్లకు పైననే. ప్రస్తుతం బెటెన్‌కోర్టు కుటుంబానికి లోరియల్‌ గ్రూప్‌లో 33 శాతం వాటా ఉంది.
 
లిలియానే 1922లో పారిస్‌లో జన్మించారు. 15 ఏళ్ల వయసులో తన కుటుంబ వ్యాపారంలో అప్రెంటిస్ చేశారు. 1957లో లోరియల్ కంపెనీకి అధినేత్రి అయ్యారు. ఈ కాస్మోటిక్‌ దిగ్గజ కంపెనీలో ఎంతో చురుకుగా పనిచేస్తూ… 2012 వరకు ఆమె కంపెనీ బోర్డులోనే పనిచేశారు. 89ఏళ్ల వయసులో ఆమె తన పదవి నుంచి దిగిపోయారు. తన కూతురుతో నెలకొన్న న్యాయ వివాద నేపథ్యంలో ఆమె తన మనవడికి లోరియల్‌ సంస్థ బాధ్యతలు అప్పజెప్పారు. 1950లో ఫ్రెంచ్ రాజకీయవేత్త ఆండ్రె బెటెన్‌కోర్టును వివాహమాడిన ఆమె, 1960, 70లలో ఫ్రెంచ్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here