చంద్రబాబుకు ఘోర అవమానం

0
1065

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. సచివాలయంలో చంద్రబాబు ఫొటో పట్ల ఉద్యోగులు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఉద్యోగులు అల్పాహారం తిన్న ఫొటోలను చంద్రబాబు ఫొటోపై పడేసి వెళ్లారు. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తిన్నారు. అనంతరం అల్పాహారం తిన్న ప్లేట్లను అక్కడే టేబుల్ మీద ఉన్న చంద్రబాబు ఫోటో మీద వేసేశారు.

 

నాలుగో అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని దేవుళ్ల ఫొటోలు ఉన్నాయి. వాటిని గోడకు తగిలిచేందుకు తెచ్చిన సిబ్బంది టేబుల్‌పైనే పెట్టారు. కాగా, ఈరోజు సమావేశ మందిరంలో సమీక్ష జరిపిన విద్యాశాఖ అధికారులు పేపర్ ప్లేట్లలో అల్పాహారం తెప్పించుకున్నారు. అయితే ఆ ప్లేట్లను పెట్టుకునేందుకు సీఎం ఫొటో ఉన్న టేబుల్‌ ను అధికారులు ఉపయోగించారు. తిన్న తరువాత ఆ ప్లేట్లను ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వాధినేత ఫొటోను కూడా పట్టించుకోకుండా డస్ట్‌బిన్‌గా వాడుకోవటం విమర్శలకు తావిచ్చింది. చంద్రబాబు పాలనా కేంద్రంలోనే ఆయన ఫొటోపై చెత్త వేయడం సచివాలయంలో ఇపుడు చర్చినీయాంశమైంది. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here