నెక్స్ట్ ముఖ్యమంత్రి అయనే కావాలంట…. మంచు విష్ణు

0
204

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు అతలా కుతలం అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆమె మరణంతో తమిళ సినీ పరిశ్రమ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అందులో బాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో తను రాజకీయాల్లోకి వస్తున్నానని, తన పార్టీ త్వరలో ప్రకటించ బోతున్నాని చెప్పాడు.

కాని అయన ఇంతవరకు తన పార్టీని ప్రకటించక పోవడంతో అభిమానులకు నిరాశ చేకూర్చారు. అయితే రజినీకాంత్ తో పాటు తమిళ హీరో కమల్ హాసన్ తానూ రాజకీయాలలోకి వస్తున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేసిన అయన ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న అంశంపై తమిళనాడులో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

తాజాగా ఆ అంశంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించాడు. కమల్ హాసన్ వంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు. కమల్ హాసన్ మేధావి అని ఆయనకు అన్ని విషయాలపై మంచి అవగాహన ఉందని మనోజ్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందన్నాడు.

నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ కమల్ అంటే తనకిష్టమని తెలిపాడు. మన దగ్గర రాజకీయ పరిస్థితులు బాగున్నాయని తమిళనాడులో బాగా లేవని చెప్పాడు.

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here