గబగబా అన్నం తినే వారికి షాకింగ్ న్యూస్ ఏంటంటే….

0
381

మనం సహజంగా ఎక్కడైనా పెళ్లి విందులో పాల్గొన్నప్పుడు గబగబా అన్నం తిని బయటికి వెళ్ళాలని చూస్తుంటాము. ఇందులో ఎక్కువ శాతం ఆడవారి కంటే మగవారు ఎక్కువ అన్నం తినేటప్పుడు సమయాన్ని కేటాయించరు ఇది సహజంగా మగవారిలో ఆనవాయితిగా వస్తుంది.

అలా గబగబా తినేవారికి షాకింగ్ న్యూస్ ఏంటంటే.. రీసెంట్ గా హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు ఒక పరిశోదనను చేశారు. ఈ పరిశోదననలో కొన్ని ఆసక్తి కర విషయాలు బయటపడ్డాయి. ఎక్కువ శతం గబగబా అన్నం తినే వారికి రక్తపోటు స్థూలకాయం మధుమేహంతోబాటు గుండెజబ్బుల ముప్పు వాటిల్లుతుందని ఈ పరిశోదననలో బయటపడింది.

వెయ్యిమందికిపైగా మధ్య వయస్కులపై ఐదేళ్లపాటు పరిశోధన చేసి వారిలో నెమ్మదిగా ఆహారం తినేవారికంటే.. వేగంగా తినేవారికి ఒబెసిటి, హై బీపీ, బ్లడ్‌ షుగర్‌, కొలెస్ట్రాల్‌ ముప్పు ఐదున్నర రెట్లు ఎక్కువని తేలింది.

ప్రశాంతంగా తినేవారికి అన్నిరకాలుగా ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. వేగంగా తినేవారిలో రోగాలబారినపడే ప్రమాదం 11.6 శాతమైతే, నార్మల్‌ స్పీడ్‌తో తినేవారికి 6.5 శాత మే ఉంటుందని హిరోషిమా వర్సిటీ పరిశోధకుడు తకయుకి యమజి వెల్లడించారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here