మహిళలపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు…

0
534

సభ్య సమాజం తల దించుకునేల ఒక మంత్రిగారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శాసనమండలిని నేడు ‘మహిళా భద్రత’పై ఏర్పాటు చేశారు. ఈ సభ ఆరంబంలో కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటని, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని అయన అన్నారు.

అందులో బాగంగానే రాత్రివేళ ఆఫీసుకు వెళుతున్న ఓ మహిళకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీని చూపిస్తూ అలాంటి సమయంలో సదరు మహిళ తన బంధువులను తోడుగా తీసుకెళ్లాలి అని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించవలసిన రక్షక శాఖా మంత్రి ఇలా అసభ్యంగా మాట్లాడటం పట్ల పలువురు మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వానికి, హోం మంత్రి రామలింగారెడ్డి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు,

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here