బ్రేకింగ్ రెండో పెళ్లి చేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు

0
273

తన భర్త రొండో పెళ్లి చేసుకున్నందుకు నిలదీసిన భార్యను టీఆర్ఎస్ యువజన నాయకుడు అతి దారుణంగా కొట్టి ఆమెను ఇంటినుంచి గెంటివేశాడు. ఈ ఘోర సంగటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు.

గత నలుగు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డి చందానగర్ కు చెందిన సంగీతను వివాహం చేసుకున్నాడు. వీరికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది తన భార్యకు మరో ఆడపిల్ల పుట్టడంతో శ్రీనివాస్ రెడ్డి సంగీతతో గోడవపడి భార్య ఉండగానే మరొక యువతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు.

ఈ విషయం తెలియగానే సంగీత తన భర్తతో గొడవ పడింది. ఈ గొడవలో శ్రీనివాస్ రెడ్డి సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేసాడు తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here