వైసీపీకి షాక్……. టీడీపీ లోకి వైసీపీ ఎమ్మేల్యే

0
323

గ‌త కొద్దిరోజులుగా పార్టీ మారుతార‌ని విప‌రీతంగా ప్ర‌చారం రావ‌డం.. పార్టీ మార‌డం లేద‌ని గిడ్డి ఈశ్వ‌రి చెప్ప‌డం మ‌నం చూస్తునే ఉన్నాం. కానీ ఆమె మాట‌ల వెన‌క ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని రాజకీయ పండితులు అప్పుడే ఊహించారు.

పైకి పార్టీ మార‌నని చెబుతున్నా.. లోలోప‌ల ప‌చ్చ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మైయ్యారు. పాడేరు నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గిడ్డి ఈశ్వరి సోమవారం ఉదయం 10 గంటలకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమెతో పాటు ఆయా గ్రామాల స‌ర్పంచులు.. ప్ర‌జాప్ర‌తినిధులు కూడా టీడీపీలో చేరారు. ఆమె చేరిక‌తో మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిన‌ట్ల‌యింది.

అందులో బాగంగానే జగన్ పాదయాత్ర ముగిసే లోపు ఇంకొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ జంప్ అవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here