రేషన్ డీపోలపై విజిలెన్స్ దాడులు ..

0
328

14 టన్నుల పి.డి ఎస్ బియ్యం స్వాదీనం చేసుకున్న అదికారులు ..
విశాఖపట్నం : పెందుర్తి మండలం లక్ష్మి పురం గ్రామం వద్ద రేషన్ డీపోలపై ఆదివారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు దాడులు నిర్వహించారు . ఈమేరకు ఆప్రాంతంలో 417 నంబర్ డిపో ను నడుపుతున్న ఎం .తారకేశ్వరి డిసంబర్ నెలకు సంబందించిన రేషన్ బియ్యాన్ని ముందుగ విడిపించుకొని గతంలో విజిలెన్స్ అదికారులు సిజ్ చేసి డిపో నంబర్ 418 లో అక్రమంగా నిల్వ చేసారన్న సమచారం మేరకు ఎస్ .పి డి.కోటేశ్వరావు ఆదేశాల తో డిపోలపై దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సి.ఐ మల్లికార్జునరావు తెలిపారు . సిజ్ చేసిన పి.డి ఎస్ బియ్యన్ని సివిల్ సప్లై ఆర్ .ఐ నవీన్ కు అప్పగించి అక్రమంగా పి.డిఎస్ బియ్యన్ని నిల్వ వుంచిన కారణంగా డిపో డీలర్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు .

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here