కోహ్లి ఖాతాలో మరో ఘనత…..

0
355

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తన టెస్టుల్లో ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా సాధించిన నాల్గో భారత ఆటగాడిగా కోహ్లి రికార్డును సొంతం చేసుకున్నాడు. నేడు శ‍్రీలంకతో మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ మార్కును చేరుకున్నాడు.

అయితే సునీల్‌ గావస్కర్‌95 ఇన్నింగ్స్‌లు, వీరేంద్ర సెహ్వాగ్‌98 ఇన్నింగ్స్‌లు, సచిన్‌ టెండూల్కర్‌103 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన భారత ఆటగాళ్లు. అయితే కోహ్లి 105 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల మార్కును చేరి నాల్గో టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు.

కాగా ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల పరంగా చూస్తేఐదు వేల పరుగుల్ని పూర్తి చేసిన వేగవంతంగా పూర్తి చేసిన క్రికెటర్లలో జో రూట్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here