మార్కెట్ లోకి కొత్త మందు వచ్చిందోచ్…..

0
774

సహజంగా మార్కెట్ లో ఎక్కువ శాతం మందుబాబులు బీరు, విస్కీ, బ్రాందీ లను ప్రతి రోజు అస్వాదిస్తూ మత్తులో మునిగి తేలుతుంటారు. అంతవరకు బాగానే ఉన్న అధిక మోతాదులో మద్యాన్ని తాగడం వలన లేనిపోని సమస్యలకు దారి తీస్తుంది. మందు బాబులు మందు ఎంత చేదుగా వున్నా వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే రుచి కూడా చేదుగా ఉంటుంది కాస్త మందెక్కువైతే వికారం వాంతులు తలపోటు వంటివి వస్తుంటాయి.

అయితే ఇక నుండి అటువంటి సమస్యలు ఉండవ్. మార్కెట్ లోకి కొత్త మద్యం రానుంది. విదేశాలలో తయారైన బయో మద్యం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రస్తుతం ఉన్న అన్ని బ్రాండ్స్ కి అతీతంగా ఈ మందు ఉండనుందట. వాసన రాకపోవడం దీని ప్యత్యేకత. పలు రకాల ఔషధ మొక్కలు, ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని ఈ కంపెనీ యాజమాన్యం వారు చెబుతున్నారు.

అయితే తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. వాసన రాకపోవడం, సైడ్‌ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్‌ డ్రైవ్‌’లో దొరికిపోవడం ఖాయమే.

 

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here