జగన్ కు షాక్…. మరో కీలక నేత వైసీపీ కి రాజీనామా..

0
426

ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో, పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ కు, దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. జగన్ పార్టీ కి చెందిన మరో కీలక నేత వైసీపీ పార్టీకి రాజీనామా చేశాడు. చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కుప్పం ప్రాంతానికి వైకాపా నేత సుబ్రహ్మణ్యం రెడ్డి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైకాపాలో అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నానని కార్యకర్తల ముందు కన్నీటితో చెప్పిన ఆయన, ఇదే విషయాన్ని జగన్ కు రెండు పేజీల లేఖలో వెల్లడించానని అన్నారు.

అందులో తన ఆవేదనంతా వెళ్లగక్కారు. అంతేకాదు.. పార్టీతో ఇన్నాళ్లుగా కొనసాగి అనుబంధాన్ని తెగదెంచుకునే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనై కంట తడి పెట్టారు కూడా. తాను వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితుల గురించి ఏకరువు పెట్టారు. 2014 ఎన్నికల్లో తనకు ఇస్తానని ఆశపెట్టి, తర్వాత బీసీ అయిన చంద్రమౌళికి ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చినా, ఆందోళన చేస్తున్న అనుచరులను బుజ్జగించి పార్టీకోసం పనిచేయడంవల్లే పార్టీ అభ్యర్థికి ఏకంగా 57 వేల ఓట్లు పోలయ్యయన్నారు.

అయినా తాను పనిచేయలేదని నిందలు వేసినా భరించానన్నారు. పార్టీలో తనకు రక్షణ కవచంగా నిలిచి కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే నడుస్తాయని నాడు పార్టీలోని పెద్దలు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయన్నారు.

కాగా, సుబ్రహ్మణ్యం రెడ్డి రాజకీయంగా ఎటు పయనిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన మాతృపార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతారని కొందరు విశ్లేషిస్తుంటే, బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానముందని మరికొందరు అంటున్నారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here