తోలి రాత్రి చివరి రాత్రి….

0
367

కన్నుల పండగ జరిగిన తమ కూతురు వివాహం ఒక్క రోజులోనే మాయమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. మొదటి రాత్రి కాళరాత్రిగా మారుతుందని ఆ నవవదువు కలగనలేదు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భర్త వికృత ప్రవర్తనకు మొదటి రాత్రే ఆ కొత్త పెళ్లి కూతురు నరకపు చివరి అంచులను చూసింది.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చిన్నదామరగుంటకు చెందిన శైలజకు అదే మండలంకు చెందిన మొతురంగనపల్లె కు చెందిన రాజేష్ తో నిన్న కొత్తపల్లిమిట్ట కల్యాణ మండపంలో వైభవంగా పెళ్లి జరిగింది.పెళ్లి కొడుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండటంతో అమ్మాయి తరపు తల్లిదండ్రులు శక్తికి మించి దాదాపు 250 గ్రాముల బంగారు, 20 లక్షల రూపాయలు కట్నం గా ఇచ్చి పెళ్లి చేశారు. శుక్రవారం రాత్రి నవ దంపతులకు పెళ్లి కుమార్తె ఇంటిలో శోభన ఏర్పాట్లను చేశారు. గదిలోకి వెళ్లిన శైలజ అరగంటలో పరుగున బయటికొచ్చేసింది. రాజేష్ చేస్తున్న వికృతాల గురించి చెప్పింది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి మళ్ళీ గదిలోకి పంపారు. గదిలోకి వెళ్లిన శైలజను, రాజేష్ విక్షణరహితంగా చిత్రహింసలకు గురిచేశాడు . బ్లేడుతో శరీరం అంతా కోసేసాడు.

ఇష్టం వచ్చిన చోట కొరికేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అనుమానం తో తలుపులు తెరవగా, అపస్మారక స్థితిలో ఉన్న శైలజను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నిందితుడు రాజేష్ ను గంగాదరనెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here