ఆయ‌న నోరు తెరిస్తే 2050..!అంటాడు…

0
361

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఇవాళ ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తున్నావో చెప్ప‌వ‌య్యా అంటే చెప్ప‌కుండా.. 2022, 2029, 2050.. అంటూ ఊద‌ర‌గొడుతున్నారాని వైఎస్సార్సీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో నేడు అనంతపురం జిల్లా గుత్తిలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరుతెరిస్తే.. 2022, 2029, 2050 అంటున్నారు. ఇప్పటికే ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇక, 2050 వచ్చేసరికి ఆయన వయస్సు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు.

2029నాటికే చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తాయ్‌. ఇవాళ ఏం చేస్తున్నవో చెప్పవయ్యా పెద్దమనిషి అంటే చెప్పకుండా.. 2020, 2050 అంటూ ఉదరగొడుతున్నారు’ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 2022నాటికి రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్‌ చేస్తా.. 2029 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేస్తా.. 2050నాటికి ఇంకా ఏమైనా ఉంటే.. అన్నిట్లో నంబర్‌వన్‌ చేస్తానని చంద్రబాబు ఊదరగొడుతున్నారని మండిప‌డ్డారు. ‘మీ గ్రామ సర్పంచ్‌ ఎవరైనా 2022కు వ్యాటర్‌ ట్యాంకు కట్టిస్తాను.. 2029నాటికి రోడ్డు వేస్తాను.. 2050 నాటికి అమెరికా మాదిరిగా చేస్తానంటే.. మీరు ఏమంటారు? మెంటల్‌ కేసు అని అనరా?’ అని ప్రజలను జ‌గ‌న్ ఉద్దేశించి ప్రశ్నించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here