లంక 373 పరుగులకే ఆలౌట్

0
247

న్యూఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఉదయం నాలుగో రోజు ఆట ప్రారంభమైన తరువాత 23 నిమిషాల్లోనే లంక కథ ముగిసింది. లంక ఆటగాడు చండీమల్ అద్భుత రీతిలో రాణించి 164 పరుగులు చేశాడు. నిన్న 9 వికెట్లు కోల్పోయిన లంక ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన తరువాత, 136వ ఓవర్ లో ఇషాంత్ శర్మ వేసిన మూడో బంతిని చండీమల్ షాట్ కొట్టగా, లాంగ్ ఆన్ లో ఉన్న శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంతో లాంఛనం ముగిసింది.

ప్రస్తుతం భారత జట్టు 163 పరుగుల లీడ్ లో ఉంది. మరికాసేపట్లో భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. సాధ్యమైనంత త్వరగా స్కోర్ బోర్డుపై 300కు పైగా పరుగులను జోడించి, రేపు ఆఖరి రోజున లంక వికెట్లన్నీ తీయడం ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here