టీడీపీ నాయకులపై శ్రీకాంత్‌రెడ్డి సంచలన విమర్శలు

0
228

పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన కాంట్రాక్టర్ సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని వైఎస్సాఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మొద‌టి కాంట్రాక్ట‌ర్ అయితే.. ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ రెండో కాంట్రాక్ట‌ర్ అని ఎద్దేవా చేశారు. మిగిలిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు స‌బ్ కాంట్రాక్టర్ల పోత్ర పోషిస్తున్నార‌ని విమ‌ర్శించారు. వీరంతా క‌లిసి పోల‌వ‌రం నిధులు మేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రాజెక్ట్ పూర్తి చేయాల‌న్న చిత్త‌శుద్ధి ప్ర‌భుత్వానికి లేద‌ని.. దోచుకునేందుకే ప్ర‌యత్నిస్తున్నార‌ని ఘ‌టుగా విమర్శించారు. పోల‌వ‌రంపై కేంద్రం మండిప‌డ్డ విష‌యం ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకే.. కాపు రిజ‌ర్వేష‌న్ తెర‌పైకి తీసుకోచ్చారని విమ‌ర్శించారు. మంజూనాథ క‌మిటీ నివేదిక ఏమైంద‌ని గ‌డికోట ప్ర‌శ్నించారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here