నేడు పవన్ పాదయాత్ర…..

0
299

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ణ్ క‌ల్యాణ్ ఇక నుండి నేరుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌నున్నారు. ఇటీవ‌లే అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి చేసిన ఆయ‌న ఇవాళ్టి నుంచి ఓదార్పు యాత్ర చేప‌ట్ట‌నున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. అనంతరం అయన విజ‌య‌వాడ‌లో ప‌డ‌వ ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబ స‌భ్యుల‌ను ప‌వ‌ణ్ క‌ల‌వ‌నున్నాడు.

అందులో బాగంగా గతంలో పవన్ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సాధించుకోవాలని, అందుకు జనసేన అండగా ఉంటుందని ఆయన నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ చేపట్టిన ఈ యాత్రకు తన ‘జల్సా’లోని సూపర్ హిట్ సాంగ్ ‘చలోరే చలోరే చల్’ అని పేరు పెట్టిన పవన్, పారదర్శకత నిండిన బాధ్యతాయుత పాలన కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here