కెప్టెన్‌ భాద్యతలు మల్లి ధోనికే…

0
279

మరి కొన్ని నెలల్లో ఐపీఎల్‌ మొదలు కానున్న సందర్బంగా చెన్నై సూపర్‌కింగ్స్‌కి మరిసారి మహేంద్ర సింగ్ ధోనికి భాద్యతలను అప్పగించింది. ధోనికి భాద్యతలను అప్పగిస్తూ నేడు ఐపీఎల్‌ పాలక మండలి దిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ జట్టు డైరెక్టర్‌ జార్జ్‌ జాన్‌ వెల్లడించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై, రాజస్థాన్‌ తమ రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకోవడంతో వచ్చే ఏడాది లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు డైరెక్టర్‌ జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ.. ‘చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్ధం కావడంలేదు. ఇక మా జట్టును ముందుండి నడిపించేది ధోనీనే. అతడే మా కెప్టెన్‌’ అని తెలిపాడు. అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాస్‌ కూడా తిరిగి మా జట్టుకు ధోనీనే కెప్టెన్‌ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here