పవన్….. చిరంజీవిని మోసం చేసింది నువ్వే రోజా సంచలన వ్యాఖ్యలు…..

0
61

తన అన్న చిరంజీవిని మోసం చేసిన వారిని ఎవ్వరిని వదిలి పెట్టనని నిన్న చలోరే చలోరే చల్ సభ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆర్కే నగరి వైసీపీ ఎమ్మేల్యే రోజా పవన్ తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా రోజా మీడియాతో మాట్లాడుతూ “మా అన్న చిరంజీవిగారికి మోసం చేసిన వారిని వదిలిపెట్టను అంటున్నాడు. మీ అన్నకు ద్రోహం చేసిన వాళ్లలో మొదట నువ్వున్నావు పవన్ కల్యాణ్, నెక్ట్స్ మీ బావ అయిన అల్లు అరవింద్ ఉన్నారు.

ఆ తరువాత చంద్రబాబు, ఆయన చానల్స్ ఉన్నాయి. మీరందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించి, ఈరోజు ఎవరో చేశారని వాళ్లను వదిలిపెట్టను అంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వంలో మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని భావించి, పరిగెత్తుకు వచ్చి, నువ్వు యువనేతగా ప్రచారం చేశారు. మీ అన్న 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే, మీ అన్నను గాల్లోకి వదిలేసి, నీ పాటికి నువ్వు షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేశావు. ముందు నిన్ను నువ్వు శిక్షించుకో” అని విమర్శలు గుప్పించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here