సాహో డేట్ ఫిక్స్ చేశారు…..

0
298

బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా సినిమా సాహో. ఈ సినిమా భాహుబలి రేంజ్ ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. 2013లో వ‌చ్చిన మిర్చి త‌ర్వాత ఈ నాలుగేళ్లలో ప్ర‌భాస్ కేవ‌లం బాహుబ‌లి 1, 2 సినిమాల్లో మాత్ర‌మే న‌టించాడు. బాహుబ‌లి కోస‌మే ప్ర‌భాస్ ఏకంగా నాలుగు సంవ‌త్స‌రాల టైం కేటాయించాడు.

బాహుబ‌లి 2 అయితే ఏకంగా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా నేష‌న‌ల్ వైడ్‌గా అంచ‌నాలు ఉన్నాయి. సాహో సినిమా తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ళ‌యాళ్‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here