రహస్యంగా శ్రుతి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా……

0
365

తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమలహాసన్‌ వారసురాలు, నటి శ్రుతీహాసన్‌ గత కొద్ది కాలంగా ఎదో ఒక విషయంలో వార్తల్లో కనిపిస్తున్నారు. అయితే తాజాగా మరోసారి వార్తల్లో కెక్కారు. శ్రుతి పట్టుచీరతో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ పట్టుపంచె, చొక్కాలతో దర్శనమిచ్చిన ఫోటోలు.. ఈ జంట రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇంకో విషయం కమనించవలసినది ఏంటంటే ఈ ఫొటోలో నటుడు కమలహాసన్‌ కూడా పట్టు వస్త్రాల్లో కనిపించడం పెద్ద విషయంగా మారింది. ఈ నేపద్యంలో ఈ ఫోటో చుసిన ప్రతిఒక్కరు నిజంగానే శ్రుతి పెళ్లి జరిగిపోయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

అయితే గతంలో శ్రుతి ముంబైలో తన బాయ్‌ఫ్రెండ్‌ను తల్లి సారికకు పరిచయం చేశారు. వీరు ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కాగా అసలు విషయానికి వస్తే దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్‌ మనవడు ఆదవ్‌ వివాహం జరిగింది. ఈ వివాహాంలో నటుడు కమలహాసన్, కూతురు శ్రుతిహాసన్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌లు పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు.

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here