డీఎల్ ర‌వీంద్ర రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0
525

మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్ర రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాంటూ వెల్ల‌డించారు. ఖాజీపేట‌లో త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. వైఎస్సా ఆర్ సీపీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చుట్టూ త‌న అనుచ‌రులే ఉన్నారంటూ ఆయ‌న బాంబ్ పేల్చారు. ఎన్నిక‌ల నాటికి అంద‌రూ త‌న ద‌గ్గ‌రికే వ‌స్తార‌ని స్పష్టం చేశారు. తన అనుచరులను పుట్టా సుధాకర్ యాదవ్ వేధించడంపై డీఎల్ ఆగ్రహం వ్యక్త‌ం చేశారు.

డీఎల్ ప్ర‌క‌ట‌న‌తో అటు టీడీపీ నేత‌లు, ఇటు వైసీపీ నేతలు డైలామాలో ప‌డిపోయారు. వచ్చే ఎన్నికల్లో డీఎల్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే అది ఏ పార్టీ అన్న‌ది ఆయ‌న స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయలేదు. టీడీపీ నేత‌లు త‌మ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్ప‌టికే ముమ్మ‌ర ప్ర‌యాత్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు వైసీపీ నేత‌లు కూడా డీఎల్తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అయితే డీఎల్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here