పవన్ కు రోజా జలక్

0
301

 

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ పై వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ ప‌వ‌ర్ స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్ అని ఆమె ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం అవినీతిలో కురుకుపోయిన‌ప్పుడు ప‌వ‌న్ వ‌చ్చి.. విష‌యాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తాడ‌ని విమ‌ర్శించారు. ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన కాద‌ని.. భ‌జ‌న సేన అని మండిప‌డ్డారు. పోల‌వ‌రం గురించి ప‌వ‌న్‌కు ఏమి తెలుస‌ని మాట్లాడుతున్నారని రోజా ప్ర‌శ్నించారు.

వార‌సత్వ రాజ‌కీయాల‌పై మాట్లాడే హ‌క్కు ప‌వ‌న్‌కు రోజా అన్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చారో తెలుసుకోవాల‌ని గుర్తు చేశారు. చిరంజీవిని మోసం చేసిన వారి జాబితాలో మొట్ట‌మొద‌ట ప‌వ‌న్ పేరే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఆమె చుర‌క‌లంటించారు.

ఆయ‌న చెప్పే మాట‌ల‌కు చేసే ప‌నుల‌కు పొంత‌న లేద‌ని మండిప‌డ్డారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here