టీడీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

0
806

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలో చివ‌రి రోజు ఏపీ స‌ర్కార్ కాపుల‌కు బిసి-ఎఫ్ కోటాలో ఐదు శాతం రిజ‌ర్వేష‌న్లకు ఆమోదం తెలప‌డంతో పాటు, ఇందుకు సంబంధించిన బిల్లు చ‌ట్ట‌బ‌ద్ద‌త కోసం ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీంతో బిసి నేత‌, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణ‌య్య కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించడాన్ని విభేదించారు. ఈ విష‌యంపై కాపు ఉద్య‌మనేత,మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం హైకోర్టులో ఆర్. క్రిష్ణ‌య్య‌పై కెవియ‌ట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్ ను స్వీక‌రించిన హైకోర్టు ఆర్. క్రిష్ణ‌య్య‌కు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. కాపుల‌ను బీసీల్లో క‌లిపితే బీసీల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని, ఏ కులాన్ని అయినా బ‌ల‌వంతంగా బిసీల్లో క‌ల‌ప‌డానికి వీల్లేద‌ని ఆర్. క్రిష్ణ‌య్య చెబుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here