ఘనంగా కోహ్లి వివాహం…

0
308

గ‌త కొన్నేళ్లుగా టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హీరోయిన్ అనుష్క శ‌ర్మ ప్రేమ వ్య‌వ‌హారం మ‌నంద‌రికి తెలిసిన విశ‌య‌మే. అయితే వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యులు కళ్లముందు, ప్రేమపక్షులు విరాట్, అనుష్కలు ఒక ఇంటివారయ్యారు. విరాట్ కు మొదటి నుంచీ మీడియా అంటే అయిష్టతే. ఎప్పుడూ కెమెరాలకు వీలైనంత దూరంగా ఉండటానికి ట్రై చేస్తుంటాడు. అదే విధంగా, తన పెళ్లిని కూడా మీడియాకు చిక్కకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలనుకున్నాడట.

తమకు మాత్రమే సొంతమైన ఈ ప్రైవసీలో మీడియా కళ్లకు, ప్రజల డిస్కషన్ కు చోటివ్వకూడదని కోహ్లీ భావించాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే, అతని ఇష్టప్రకారం, తను ఎవరినైతే దగ్గర ఉండాలని కోరుకున్నాడో, వారందరూ ఈ వివాహానికి హాజరు కావడం విశేషం. ఇక పెళ్లి అయిన తర్వాత, భారత కాలమానం ప్రకారం 8 గంటలకు వారి పెళ్లి వార్తను తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు విరాట్, అనుష్కలు. పెళ్లిలో తీసిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటికొచ్చాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here