వాట్సాప్ వాడే వారి పెద్ద గుడ్ న్యూస్

0
336

ప్రపంచంలోనే అత్యధిక మంది యూజర్లు వాడుతన్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు తన నూతన ఫీచర్లను తన వినియోగదారులకు అందిస్తున్న విషయం తెలిసిందే… అందుకే ఈ యాప్‌ను వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే తన వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ త్వరలోనే మరో మూడు అధునాతన ఫీచర్లను బహుమతిగా ఇవ్వనుంది.. వాటిలో షేక్‌ టు రిపోర్ట్‌, ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, ప్రైవేట్‌ రిప్లైస్‌ ఫీచర్లు ఉన్నాయి.

వాట్సాప్‌లో ఏమైనా సాంకేతికమైన సమస్య తలెత్తితే … ఒక్కోసారి సందేశాలు వెళ్లవు.. రావు. వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి తెలియజేయడానికి.. కేవలం మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ కావడంతో పాటు .. ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో మనకు తలెత్తిన సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు. వాట్సాప్‌ ఏ నెంబర్ నైనా బ్లాక్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి ఆ నంబర్ ను బ్లాక్‌ చేయాలి. ఒకవేళ ఆ నెంబర్‌ను అన్‌బ్లాక్‌ చేయాలంటే.. మళ్లీ సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కానీ ఈ ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై లాంగ్ ప్రెస్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది.

మనం వాట్సాప్‌లో గ్రూప్‌ మెసేజ్‌లు పంపిస్తుంటాం… గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుందన్న విషయం తెలిసిందే.. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసి మెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ ప్రెస్ చేస్తే సరి..

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here