వర్మ నీకు దమ్ముంటే కడపకు రారా…….

0
349

వ‌ర్మ.. నీవు ఎక్క‌డో ముంబాయికి పారిపోయి మాట్లాడ్డం కాదు.. ద‌మ్ముంటే క‌డ‌ప‌కు వ‌చ్చి మాట్లాడు..అని క‌డ‌ప స్టీల్ ప్లాంట్ సాధ‌న సమితి అధ్యక్షుడు కుమార్ రెడ్డి స‌వాల్ విసిరారు. గ‌తంలో బెజ‌వాడ‌ను రౌడీల అడ్డ‌గా చూపించావు.. ఇపుడు రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ హ‌త్యలు చూపిస్తున్నావు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తే నిన్ను త‌రిమి కొట్ట‌డం ఖాయ‌మ‌నిఆయ‌న హెచ్చరించారు.

రాజులేలిన ర‌త‌నాల సీమ‌ను ఫ్యాక్ష‌న్ సీమ‌గా చూపించ‌డం త‌గ‌ద‌ని.. వ‌ర్మ తీస్తున్న వెబ్ సిరీస్‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని పోలీసుల‌ను కోరారు. కేవ‌లం డబ్బు కోసం ఎప్పుడో జ‌రిగిన వాటిని ఇప్పుడు తీస్తే ఎవ‌రు న‌మ్మ‌ర‌న్నారు. ఎదుటి వారి బాధ‌లో సంతోషాన్ని చూసే వ‌ర్మ‌.. నిజంగా తెలుగు గడ్డ‌పైనే ప‌ట్టావా.. అని ప్ర‌శ్నించారు.

సీమ చ‌రిత్ర గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here