కర్ణాటక కొత్త సిఎం కొత్త సెంటిమెంట్ ….

0
199

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జెడి(ఎస్) నేత కుమారస్వామి తనకు లక్కీ భవనంగా భావించే జేపీ నగర్‌లోని తన నివాసం నుండే పరిపాలనను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ముఖ్యమంత్రులకు కర్ణాటకలో అనుగ్రహ భవనాన్ని కేటాయిస్తారు. అయితే ఈ భవనం నుండి పాలన సాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని భావించారు. ఈ భవనం కూడ వాస్తు పరంగా ఇబ్బందులు కూడ ఉన్నాయని ప్రచారం. దీంతో ఈ భవనంలోకి వెళ్ళేందుకు కుమారస్వామి ఇష్టపడలేదని సమాచారం. దీనికితోడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రత్నప్రభ నివాసం ఉంటున్న భవనం వాస్తుపరంగా మెరుగ్గా ఉంది. ఈ భవనంలోకి కూడ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ భవనంలోకి మారుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ కుమారస్వామి మాత్రం జేపీ నగర్ లోని తన నివాసం నుండే పరిపాలన సాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here