ప్రస్థానం హిందీ రీమేక్ …. తెలుగు దర్శకుడే, మరి ఈ సినిమాలో స్టార్ హీరో ఎవరో తెలుసా ???

0
205

దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన ప్రస్థానం చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2010 వచ్చిన ఈ చిత్రంతో అభిరుచిగల దర్శకుడుగా దేవా కట్ట ప్రశంసలు అందుకున్నారు. శర్వానంద్, సాయికుమార్ , సందీప్ కిషన్ ప్రధాన పాత్రలలో ఈ చిత్రం తెరకెక్కింది.

తాజగా ఈ చిత్ర హిందీ రీమేక్ ఖరారైంది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, అలీ ఫజల్, అమైరా దస్తూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

సంజయ్ దత్ తల్లి నర్గిస్ జయంతి జూన్ 1 న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి. తెలుగులో దేవాకట్ట వెన్నెల, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలు తెరకెక్కించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here