ట్రంప్ – కిమ్ ల భేటి రద్దు

0
239

వాషింగ్టన్‌/ప్యాంగ్యాంగ్: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య జూన్‌ 12న జరగాల్సిన భేటీ రద్దయింది. కిమ్‌తో తాను భేటీ కాబోవటం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ట్రంప్‌ పేరుతో శ్వేతసౌధం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

‘మీతో భేటీ అవ్వడానికి నేను ఎంతో ఆస్తక్తిగా ఎదురు చూశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఇటీవల మీరు చేసిన ప్రకటనల్లో అమెరికాపై ఎంతో ద్వేషం, శత్రుత్వ వైఖరిని ప్రదర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఈ భేటీ అనవసరం అనిపించింది’ అని కిమ్‌ను ఉద్దేశించి ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here