బాలయ్యతో మల్లి బోయపాటి

0
241

నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంతో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో మూవీ వస్తుండటంతో అంచనాలు రేకెత్తుతున్నాయి. ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కాగా ఈ మూవీ లాంచ్‌ చిత్రానికి హైప్ తెచ్చేవిధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వచ్చే నెల 10న (జూన్ 10) ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడటం.. దర్శకుడి అన్వేషణలో భాగంగా కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడమే బెటర్ అని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బోయపాటి – బాలయ్య కాంబో మూవీ పొలిటికల్ డ్రామా తెరకెక్కునున్నట్లు సమాచారం. 2019 ఎన్నికలకు ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిఉంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here