టి ఆర్ ఎస్ లో కి టి డి పి వలసలు

0
395

హైదరాబాద్‌ : జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బోగ వెంకటేశ్వర్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్‌ ఎంపీ కవిత సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ముఖ్య అనుచరుడైన వెంకటేశ్వర్లుకు మంత్రి కేటీఆర్‌ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వర్లుతో పాటు వడ్డెర సంఘం నేత మొగిలి, పద్మశాలి సంఘం నేతలు బూస గంగారాం, మానపూర్‌ శ్రీహరి, పూసల సంఘం నేతలు సురేందర్, చకిలం కిషన్, బోగ ప్రవీణ్‌ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై అందరూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జగిత్యాల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సంజయ్‌ కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు,  గుండు సుధారాణి పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here