ఐర్లాండ్‌ అబార్షన్‌ చట్టాన్ని సవరించండి

0
189

డబ్లిన్‌ : అబార్షన్‌ చట్టాన్ని మరింత సరళం చేయాలని ఐర్లాండ్‌ ప్రజలు కోరుకుంటున్నారు. ఐర్లాండ్‌ రాజ్యాంగం ప్రకారం అబార్షన్‌ నేరం. ఆ చట్టంలో సవరణ కోరుతూ శనివారం ఐర్లాండ్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ పోల్‌లో ప్రజలు భారీ ఎత్తున ఓట్లేశారు. సుమారు 70 శాతం ఓటింగ్‌ జరిగింది. రాజ్యాంగంలోని ఎనిమిది సవరణను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. అబార్షన్‌ చట్టాన్ని మార్చాలంటూ సుమారు 69 శాతం ఓటర్లు ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. అయితే శనివారం సాయంత్రం తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. 1983లో జరిగిన రాజ్యాంగ 8వ సరవణలో.. అబార్షన్‌ చట్టాన్ని పొందుపరిచారు. కడుపులో పిండం, తల్లికి సమాన హక్కులు కల్పిస్తూ అప్పుడు చట్టాన్ని తయారు చేశారు. ఒకవేళ అబార్షన్‌ చట్టాన్ని మార్చాలంటూ రెఫరెండమ్‌లో తేలితే, అప్పుడు కొత్త నియమావళిని రూపొందిస్తారు. ప్రెగ్నెంట్‌ మహిళలకు 12 వారాలు ఉన్న గర్భాన్ని తొలిగించుకునే అవకాశం ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఒకవేళ తల్లికి ఏదైనా ప్రమాదం ఉండే కేసులో.. అప్పుడు కూడా అబార్షన్‌కు అనుమతి ఇవ్వనున్నారు. శనివారం దేశవ్యాప్తంగా సుమారు 6500 పోలీస్‌ స్టేషన్లలో ఓటింగ్‌ జరిగింది. 2015లో జరిగిన సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ రెఫరెండమ్‌ కంటే ఎక్కువ మందే ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here