చెన్నై చేరిన ధోని సేన , ఘన స్వాగతం

0
211

చెన్నై: చెన్నైలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడి వెళ్లిపోయిన వారి అభిమాన జట్టు ఇప్పుడు ఏకంగా టైటిల్‌తోనే తిరిగొచ్చింది. అందుకే వారూ వీరనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తమ సూపర్‌ కింగ్స్‌కు అపూర్వ రీతిలో స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన ధోని సోమవారం పూర్తి జట్టుతో చెన్నైకి తరలి వెళ్లింది. విమానాశ్రయం, హోటల్‌ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఫ్యాన్స్‌ తమ కింగ్స్‌కు స్వాగతం చెప్పారు. జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌. శ్రీనివాసన్‌ ఇచ్చిన ప్రైవేట్‌ డిన్నర్‌కు ఆటగాళ్లంతా రాత్రి హాజరయ్యారు. మరోవైపు జట్టు సీఈఓ కేఎస్‌ విశ్వనాథన్‌ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం గుడిలో వెంకటేశ్వర స్వామి ముందు ఐపీఎల్‌ ట్రోఫీని ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here