ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండేజ్‌పై సీబీఐ కేసు

0
208

నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్‌‌పై ఉచ్చు బిగిసింది. ఫెర్నాండేజ్‌తో పాటు పలువురిపై సీబీఐ మంగళవారం (మే 29) కేసు నమోదు చేసింది. ఇంటర్నేషనల్ ఫ్లైయింగ్ లైసెన్స్ జారీలో నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో 5/20 (ఐదేళ్ల అనుభవం, 20 ఎయిర్‌క్రాఫ్ట్‌లు లైసెన్స్ పొందడానికి అర్హత కలిగి ఉండటం) నిబంధనలు ఉల్లంఘించారనేది ఫెర్నాండేజ్‌పై ప్రధాన ఆరోపణ. అదేవిధంగా ఎఫ్‌ఐపీబీ నిబంధనల ఉల్లంఘనపై కూడా కేసు నమోదైంది.

ఎయిర్ ఏషియా గ్రూప్‌కు చెందిన ట్రావెల్ ఫుడ్ ఓనర్ సునీల్ కపూర్, డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, కన్సల్టెంట్ దీపక్ తల్వార్, రాజేంద్ర దూబే, ఇతర ప్రభుత్వ అధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పొందుపరిచింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు మరో మూడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టి లైసెన్స్‌లు పొందడం, 5/20 నిబంధనల్లో మార్పు చేసే విధంగా ఏజెన్సీని ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డట్లుగా టోనీ ఫెర్నాండేజ్‌పై కేసు నమోదైంది. ఈ ఉదంతంతో అంతర్జాతీయంగా ఎయిర్ ఏషియా ప్రతిష్ట మసకబారుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here