ఏదైనా జరగొచ్చు…రెడీగా ఉండండి:నాని

0
269

తెలుగులో గత ఏడాది ప్రారంభించిన బిగ్ బాస్-1 గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ -2 కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ లో “ఈ సారి ఇంకొంచెం ఎక్కువ మసాలా“ అంటూ బిగ్ బాస్-2 ఎలా ఉండబోతోందో నాని చెప్పకనే చెప్పాడు. తాజాగా బిగ్ బాస్ -2 సీజన్ జూన్ 10 నుంచి ప్రారంభం కాబోతోందంటూ నాని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ -2లో `ఏదైనా జరగొచ్చు`అంటూ ఈల వేసి మరీ గోల చేస్తున్నాడు నాని. ‘జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2’ అంటూ నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతోపాటు ఆ షో ప్రసారమయ్యే టైమింగ్స్ కు సంబంధించిన ఓ పోస్టర్  ను కూడా నాని ట్వీట్ చేశాడు. సోమవారం నుంచి శుక్ర వారం వరకు రాత్రి 9.30 గంటలకు – శని – ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ -2 ప్రసారం కానుంది. గత ఏడాది 70 రోజుల పాటు సాగిన ఈ షో ….ఈ సారి 100 రోజులు కొనసాగనుంది.

ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన ఎక్కువ మందికి చేరువైన సోషల్ ఎక్స్ పరిమెంట్ షో బిగ్ బాస్. దీనికన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ షో లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ షో ఇప్పటివరకు దాదాపుగా 500 సీజన్లు అంటే 40 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 60 దేశాల్లో ఈ షో కు మంచి క్రేజ్ ఉంది. 1999లో నెదర్లాండ్స్ లో మొదటిసారిగా  బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభించిన షో ….కాలక్రమంలో బిగ్ బాస్ గా పాపులర్ అయింది. భారత్ లో తొలిసారిగా బాలీవుడ్ లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే 11 సీజన్ లు పూర్తి చేసుకుంది. గత ఏడాది తెలుగు తమిళ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ బిగ్ బాస్ కు అంతగా క్రేజ్ రాలేదు. అయితే తెలుగులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ -2కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో…..నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. మరి నేచురల్ స్టార్ నాని…ఈ షోని ఏ రేంజ్ లో రక్తి కట్టిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here