జట్టులో అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూసే స్థితిలో లేను – రోహిత్‌శర్మ

0
411

ముంబై : జట్టులో అవకాశం వస్తుందా లేదా అని ఎదురు చూసే స్థితిలో లేనని, ఇప్పుడు కేవలం క్రికెట్‌ ఆస్వాదించడమే తన పని అని టీమిండియా లిమిటెడ్‌ ఫార్మట్‌ వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ అభిప్రాయపడ్డాడు. లిమిటెడ్‌ ఫార్మట్‌లో చెలరేగే రోహిత్‌ టెస్టుల్లో తడబాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. గత దక్షిణాఫ్రికా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు సైతం సెలక్టర్లు రోహిత్‌కు విశ్రాంతి కల్పించారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం సెలక్షన్‌ గురించే ఆలోచించే స్థితిలో లేను. ఇప్పటికే సగం కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. మిగతా కెరీర్‌ను ఆస్వాదించాలనుకుంటున్నా. కెరీర్‌ ప్రారంభంలో జట్టులో చోటు కోసం ఆరాటపడేవాడిని. జట్టులో చోటు దక్కిందా? మ్యాచ్‌లో ఆడుతానా లేదా అని ఎదురుచూసే వాడిని. ఆ సమయంలో దిగ్గజాలు సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌లు ఉండేవారని దీంతో చోటుకోసం ఎదురుచూడాల్సి వచ్చేది. సెలక్షన్‌ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని గ్రహించాను.’ అని అభిప్రాయపడ్డాడు. అఫ్గాన్‌ టెస్టుకు ఎంపికాకపోవడంతో ఎలాంటి ఆశ్చర్యానికి గురికాలేదని, భవిష్యత్తు టోర్నీల కోసమే విశ్రాంతి కల్పించుంటారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here