పట్టు విడవకుండా పోరాడిన ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హాలెప్

0
255

అంచనాలకు అనుగుణంగా రాణించిన సీడెడ్లు అందరూ ఫ్రెంచ్ ఓపెన్‌లో సాఫీగా మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ నంబర్‌వన్ హాలెప్ కాస్త చెమటోడ్చినా.. కీలక సమయంలో ప్రత్యర్థిని కంగుతినిపించగా, స్వితోలినా, క్విటోవా అలవోకగా ముందుకెళ్లారు. పురుషుల్లో జొకోవిచ్ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకపోయినా.. మారథాన్ మ్యాచ్‌ల్లో జ్వరేవ్, దిమిత్రోవ్ పట్టువిడవకుండా పోరాడి విజయాలు సాధించారు. ఓవరాల్‌గా నాలుగో రోజు ఎలాంటి పెను సంచలనాలు నమోదుకాలేదు.

పారిస్: తొలి సెట్ చేజారినా.. పట్టు విడవకుండా పోరాడిన ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హాలెప్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. వర్షం అంతరాయం వల్ల బుధవారం ముగిసిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో టాప్‌సీడ్ హాలెప్ (రొమేనియా) 2-6, 6-1, 6-1తో ప్రపంచ 83వ ర్యాంకర్ అలిసన్ రిస్కీ (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్‌లోకి అడుగుపెట్టింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. నంబర్‌వన్ ప్లేయర్ ఆరంభంలో కాస్త తడబడింది. దీంతో ప్రత్యర్థికి సర్వీస్‌లను కోల్పోతూ 0-5తో వెనుకబడింది. కానీ రెండోసెట్ నుంచి తన వ్యూహం మార్చి దూకుడును చూపెట్టింది. బలమైన సర్వీస్‌లు, సుదీర్ఘమైన ర్యాలీలు సంధిస్తూ అమెరికన్‌ను ఎక్కడిక్కడే కట్టడి చేసింది. 2014, 17లో రన్నరప్‌గా నిలిచిన హాలెప్.. తొలిసెట్‌లో 16సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. చివరి రెండు సెట్లలో రిస్కీ రెండుసార్లు మాత్రమే సర్వీస్‌ను కాపాడుకున్నది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here