అల్లు శిరీష్.. తో శ్రీకాంత్ అడ్డాల ????????

0
191

‘బ్రహ్మోత్సవం’ సినిమాతో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ను పెట్టి అలాంటి సినిమా తీస్తాడా అని అందరూ అతడిని తిట్టిపోశారు. ఆ సినిమా పరాజయానికి అతడినే పూర్తి బాధ్యుడిని చేశారు. గత కొన్నేళ్లలో ఒక సినిమా వల్ల మరే దర్శకుడికీ ఇంత చెడ్డ పేరు వచ్చి ఉండదేమో. ఆ ప్రభావం అతడి కెరీర్ పై బాగానే పడింది. మహేష్ లాంటి హీరోతో రెండు సినిమాలు చేసిన వాడు.. ఇంకో అవకాశం దక్కించుకోవడానికి రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. చిన్న-మీడియం రేంజి హీరోలు కూడా అతడితో సినిమా చేయడానికి వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఇక నిర్మాతల సంగతి సరేసరి. ఐతే చివరికి గీతా ఆర్ట్స్ అడ్డాలకు అవకాశమివ్వడానికి ముందుకొచ్చిందని వార్తలొచ్చాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here