రాజ్‌భవన్‌ స్కూల్‌​ వద్ద గందరగోళం

0
382

హైదరాబాద్‌: వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. ఎండల తీవ్రత తగ్గనప్పటికీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి. వార్షిక విద్యా ప్రణాళికలను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే జూన్‌ 1 నుంచే పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో రాజ్‌భవన్‌ ప్రభుత్వం పాఠశాల ఈరోజు ప్రారంభమైంది. దీంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్ద బారులు తీరారు. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది. పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here