తారక్ అందరికీ ఛాలెంజ్ విసిరాడు

0
206

ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం రోజూ చూసే తారలు అస్సలు కనిపించడం లేదు. రోజు ఎదో ఒక స్టైలిష్ ఫొటోతో కనిపించే సెలబ్రెటీలు ఇప్పుడు జిమ్ లో ఫొటోలకు పోజులిస్తున్నారు. గత కొంత కాలంగా మన ఇండియన్ సెలబ్రెటీలు జిమ్ వర్కౌట్స్ ద్వారా ఛాలెంజ్ విసురుకుంటున్న సంగతి తెలిసిందే. అది బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. “హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్” ఛాలెంజ్ లో భాగంగా మోహన్ లాల్ తారక్ కి ఛాలెంజ్ విసిరారు.

వీరిద్దరూ జనతా గ్యారేజ్ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్లోజ్ అయ్యారు. ఇకపోతే మోహన్ లాల్ విసిరిన ఛాలెంజ్ కి తారక్ గట్టి రీప్లై ఇచ్చాడని చెప్పాలి. కష్టపడి రోజు చేసే వర్కౌట్ ట్రైనర్ స్టీవెన్ తో చేస్తున్నట్లు వివరించిన ఎన్టీఆర్ అదే తరహాలో మరికొంత మందికి ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ – మహేష్ బాబు – రామ్ చరన్ – రాజమౌళి – కొరటాల శివ.. అందరికి నా ఛాలెంజ్.. అని తారక్ వారిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.

ఇక రామ్ చరణ్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేదు కాబట్టి ఆయాన సతీమణి ఉపాసనని ట్యాగ్ చేస్తూ.. దయచేసి చరన్ కు తెలియజేయండి అని తారక్ ట్వీట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. మరి వారందరి నుంచి ఎంత స్ట్రాంగ్ గా రీప్లై వస్తుందో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here