రానా కంటికి మళ్లీ ప్రాబ్లమ్???

0
226

టాలీవుడ్ స్టార్ హీరో అనడం కన్నా బెస్ట్ యాక్టర్ లో ఒకరు అనడమే మంచి గుర్తింపు. అలాంటి గుర్తింపు అందుకున్న వారిలో రానా ఉన్నాడు. మంచి కథలు తన వరకు వస్తే ఏ మాత్రం మిస్ చేసుకొని ఈ హీరో ఎంతగా ఫెమస్ అయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే రానా చాలా కాలం తరువాత ఒక ఆపరేషన్ కోసం సిద్దమవుతున్నాడు. రానా కి ఒక కన్ను సరిగ్గా కనిపించదని అందరికి తెలిసిందే.

గతంలో చాలా సార్లు రానా ఆ విషయం గురించి ఏ మాత్రం బాధపడకుండా చెప్పాడు. అయితే ఆపరేషన్ నిమిత్తం రానా ఇప్పుడు సిద్దమవుతున్నాడు. తన కుడి కన్నుకు వైద్యం చేసే సమయం రావడంతో విదేశాలకు వెళ్లనున్నారు. రీసెంట్ గా సురేష్ బాబు ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సర్జరీ కోసం యూఎస్ వెళుతున్నట్లు సురేష్ బాబు తెలిపారు.

తనపై ఒకరు జాలి చూపించడం ఈ హీరోకి నచ్చదు. అందుకే చాలా వరకు తన సమస్యను రానా ఎక్కువగా చెప్పుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం రానా చాలా షూటింగ్ లకు బ్రేక్ చెప్పేశాడు. మరికొన్నిటిని ఫినిష్ చేశాడు. అందులో చాలా వరకు బైలాంగ్యువల్ తెరకెక్కుతున్నవే!

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here