పశ్చిమ గోదావరి లో 178వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

0
247

పాలకొల్లు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 178వరోజు పాదయాత్రను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం ఉల్లంపర్రు(నైట్‌ క్యాంప్‌) నుంచి వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం ప్రారంభించారు. అక్కడి నుంచి జిన్నూరు, మట్టిపర్రు క్రాస్‌, బొల్లెటిగుంట, వెదంగి, కవిటం లాకులు, కవిటం మీదుగా జగన్నాధపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇప్పటి వరకు జననేత 2,215.3 కిలోమీటర్లు నడిచారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here