తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) అధ్యక్షుడిగా కేటీఆర్ రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక

0
243

హైదరాబాద్,నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రధాన కార్యదర్శిగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నాలుగేండ్ల పదవీకాలానికి రెండోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం గచ్చిబౌలిలో జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2018 నుంచి 2022వరకు కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు నిర్వహించనుంది. సంఘం ఉపాధ్యక్షులుగా వై ఉపేందర్‌రావు, చాముండేశ్వర్‌నాథ్, ఏ రామారావు,పీ రమేశ్‌రెడ్డి, జీ వెంకట్రావు వ్యవహరించనుండగా..కోశాధికారిగా కే.ఫణిరావు, సలహాదారుగా కే శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here