నాని హోస్ట్ గా బిగ్ బాస్2

0
226

నాని హోస్ట్ గా బిగ్ బాస్2 ప్రారంభం కాబోతోంది. గతేడాది ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన ఈ కార్యక్రమం వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్.. తమిళ్ లో కమల్ హాసన్.. తెలుగులో ఎన్టీఆర్.. ఇలా అందరూ పెద్ద స్టార్స్ తోనే బిగ్ బాస్ ను నిర్వహించారు.

కానీ తెలుగులోనే బిగ్ బాస్ రెండో సీజన్ కు మీడియం రేంజ్ నుంచి స్టార్ హీరో రూట్ లో ఉన్న న్యాచురల్ స్టార్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ దీని వెనుక మొత్తం కథ నడిపించిన వ్యక్తి అల్లు అరవింద్ అంటున్నాడు నాని. ‘మొదటగా అల్లు అరవింద్ గారు ఓ రోజు ఫోన్ చేసి.. బిగ్ బాస్ ను ఈసారి నువ్వే హోస్ట్ చేయాలి అన్నారు. ఆయన ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. నన్ను విపరీతంగా విశ్వసించారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నాకు కూడా చేయగలననే నమ్మకం కలిగింది. ఆయన నాపై ఉంచిన నమ్మకమే.. నన్ను ఈ కార్యక్రమం వైపు నడిపించింది’ అన్నాడు నాని.

తను ఇప్పటివరకూ ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా పూర్తిగా చూడలేదని.. అలాంటిది తాను హోస్ట్ చేయడం ఏంటా అనిపించిందని అంటున్నాడు నాని. అయితే.. ఈ విషయంలో ఎన్టీఆర్ ఓ అద్భుతమైన కిటుకు చెప్పాడట. మహానటి ఆడియో ఫంక్షన్ లో కలిసినపుడు.. ఎలాంటి టిప్స్ ను ఫాలో కాకపోవడమే అసలు సిసలైన చిట్కా అన్నాడట ఎన్టీఆర్.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here