తిరుపతిలో నిపా వైరస్‌ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు కార్పొరేషన్‌ అధికారులను అప్రమత్తం

0
198

 నెల్లూరు సిటీ : తిరుపతిలో నిపా వైరస్‌ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు కార్పొరేషన్‌ అధికారులను అప్రమత్తం చేశారు. పందుల కారణంగా నిపా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని పట్టివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు పందుల యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి కార్పొరేషన్‌ పరిధి లోని పందులను ఇతర ప్రాంతాలకు తరలిం చడం, కాల్చివేయడం చేయనున్నారు.

నగరంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పందుల యజమానులను అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. కార్పొరేషన్‌ అధికారులు అప్పుడప్పుడు తూతూమంత్రంగా పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో పందుల పెంపకందారులు సుమారు 200మందికి పైగా ఉన్నారు. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, బీవీనగర్, కొండాయపాళెంగేటు, కుక్కలగుంట, తదితర ప్రాంతాల్లో పందుల పెంపకం చేపడుతున్నారు. నగరంలో దాదాపు 5వేలకు పైగా పందులు సంచరిస్తున్నాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here