సత్తా చూపిస్తున్న అభిమన్యుడు : 12 కోట్ల వసుళ్ళు

0
201

విశాల్‌ చాలా ఏళ్ల తరువాత పెద్ద హిట్‌ కొట్టారు. పందెంకోడి లాంటి హిట్‌ తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో హిట్‌పడలేదు. మాస్‌ ఇమేజ్‌ అంటూ ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ ఉన్న విశాల్‌ గతేడాది డిటెక్టివ్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. కానీ​ ‘అభిమన్యుడు’ సినిమా ఆ లోటును తీర్చేస్తోంది.

విడుదలైన రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తూ… విజయవంతంగా ఫస్ట్‌ వీక్‌ను కంప్లీట్‌ చేసుకుంది. మొదటి వారాంతానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారాంతంలో కూడా ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సమంత, అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి హారిస్‌ జయరాజ్‌ సంగీతమందించగా, పీఎప్‌ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. విశాల్‌ ప్రస్తుతం పందెంకోడి2, టెంపర్‌ రీమేక్ మూవీలతో బిజీగా ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here