భారత్ కోసం అమెరికా చారిత్రాత్మక నిర్ణయం: ఏమిటీ కమాండ్ లైన్? చైనాకు చెక్!

0
262


వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వ్యూహాత్మకంగా అమెరికా – పసిఫిక్ కమాండ్ లైన్‌ను ఏర్పాటు చేసిన అమెరికా ఇప్పుడు ఆ పరిధిని పెంచింది. ఇండో – పసిఫిక్ కమాండ్ లైన్ పేరుతో మరింత విస్తరించింది. తద్వారా భారత్‌కు సముచిత స్థానం కల్పించింది. అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలలో భారత్‌ను కీలక భాగస్వామిగా మారుస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఉన్న యూఎస్ – పసిఫిక్ కమాండ్ లైన్ హెడ్ క్వార్టర్ పేరును ఇండో – పసిఫిక్ కమాండ్ లైన్‌గా మారుస్తున్నట్లు వారం క్రితం ప్రకటించింది. జూన్ 27వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు భారత్ సహా పలు దేశాలతో హవాయిలో అతిపెద్ద నావికాదళ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here