‘ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌’ ఫలితాలు విడుదల – 11 నుంచి 18 వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు..

0
380

హైదరాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తంగా 4,18,402 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఫస్టియర్‌ జనరల్‌ విద్యార్థులు 2,56,186 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,65,971 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

వారిలో 1,26,117 మంది ఇంప్రూవ్‌మెంట్‌ రాసిన వారుండగా, 39,854 మంది వార్షిక పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫస్టియర్‌ ఒకేషనల్‌ పరీక్షలకు 12,707 మంది హాజరవ్వగా, 7,214 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులు 1,42,144 మంది పరీక్షలు రాయగా.. 59,233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 7,365 మంది పరీక్షలకు హాజరవ్వగా, 3,977 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here