‘అష్టాచెమ్మా’పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్

0
295

‘అష్టాచెమ్మా’ సినిమా చూసినంత సేపూ ప్రేక్షకుల తలపుల్లోకి మహేష్ బాబు వస్తూనే ఉంటాడు. ఆ సినిమా మూల కథ అతడి పేరు చుట్టూనే తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. దీని గురించి మహేష్ బాబు ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఐతే ఆ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు మహేష్ బావ సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మహేష్.. ఇంద్రగంటి గురించి మాట్లాడుతూ ‘అష్టాచెమ్మా’ ప్రస్తావన తెచ్చాడు. తాను ఇంద్రగంటి తీసిన ‘అష్టాచెమ్మా’తో పాటు ‘జెంటిల్ మన్’ కూడా చూసినట్లు వెల్లడించాడు. రెండూ నచ్చాయని.. ‘అష్టా చెమ్మా’ తన ఫేవరెట్ ఫిలిం అని చెప్పాడు మహేష్. ఐతే ఆ సినిమాలో తన పేరు వాడారు కాబట్టి అది నచ్చిందని అనుకోవద్దని.. మామూలుగానే ఆ సినిమా తనకెంతో ఇష్టమని చెప్పాడు మహేష్.

ఇక సుధీర్ బాబు గురించి మాట్లాడుతూ.. తాను కానీ.. తమ కుటుంబ సభ్యులు కానీ.. సుధీర్ బాబుకు మొదట్నుంచి ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదని.. కేవలం ఆడియో వేడుకలకు రావడం తప్పితే తాము చేస్తున్నది ఏమీ లేదని.. సుధీర్ తన కష్టంతో ఎదుగుతున్నాడని.. అతడిని చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని మహేష్ చెప్పాడు. సుధీర్ మాట్లాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోవడం గురించి స్పందిస్తూ.. తన సినిమా వేడుకలకు వచ్చినపుడు స్పీచులు ఇరగ్గొట్టేస్తుంటాడని.. కానీ తన సినిమా వేడుకలో మాత్రం సెంటిమెంటల్ అయిపోయాడని మహేష్ చమత్కరించాడు. హీరోయిన్ అదితి రావు గురించి మాట్లాడుతూ.. మణిరత్నం ‘చెలియా’ సినిమాలో ఆమె చాలా బాగా నటించిందన్నాడు మహేష్.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here