కలకలం:మహిళా హోంగార్డు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…కానిస్టేబుల్ అయిన భర్త వేధింపులే కారణం

0
155

కలకలం:మహిళా హోంగార్డు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…కానిస్టేబుల్ అయిన భర్త వేధింపులే కారణం

 

విజయవాడ:చట్టాన్ని కాపాడాల్సిన ఒక రక్షక భటుడే తన భార్య పాలిట యమ భటుడిలా మారాడు…హోం గార్డ్ అయిన తన భార్యను నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేని ఆమె చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బలవన్మరణానికి పాల్పడాలని ప్రయత్నించింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కాగా ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన ఆమెను భర్త తరుపువారు సైలెంట్ గా అస్పత్రికి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అయితే కాలిన గాయాలతో ఈ మహిళా హోంగార్డు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళితే…

విజయవాడ నగరంలోని అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ పనిచేస్తున్న మురళి, లక్ష్మీ ప్రసన్న భార్యాభర్తలు. లక్ష్మీ ప్రసన్న గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో హోంగార్డుగా పని చేసి ఆ తరువాత మానేసింది. అనుమానంతో భర్త మురళీ నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగిపోయిన లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంది.

దీంతో 90 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న మృత్యువుతో పోరాడుతోంది. అయితే ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా బైటకు తెలియనివ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here